ఎస్ ఐ ఆర్ సర్వేకు సహకరించండి
25-06-2026 02:56 PM
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్ (విజయక్రాంతి ): ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వేకు వచ్చినటువంటి అధికారులకు ప్రజలు సహకరించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంక మౌనిక మహేందర్ అన్నారు. గురువారం ఆమె ఖానాపూర్ మున్సిపాలిటీ లోని శాంతినగర్ కాలనీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వచ్చిన అధికారులకు, వారు అడిగిన వివరాలు ఇచ్చి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ అంకం మహేందర్ ,సర్వేయర్ బిఎల్ఓ లు పాల్గొన్నారు.






