6 May, 2026 | 8:15 PM

Breaking News

సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •  

వర్షాలపై అప్రమత్త ఉండండి

24-02-2026 01:04 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): వర్షాకాలంలో, నిర్మల్ పట్టణంలో వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, వర్షాకాలం వరదల నివారణపై చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ పట్టణంలో వర్షాకాలం అధికంగా ఇబ్బందు లు కలిగే ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపా రు.

అవసరమైన చోట కల్వర్టర్లు నిర్మించాలని పేర్కొన్నారు. ముందస్తు పటిష్ట ప్రణాళికల ద్వారా పట్టణంలో వరదల వల్ల నష్టాలను నివారించగలుగుతామని వివరించారు. పటిష్ట చర్యలు చేపట్టి, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, తహసిల్దార్ రాజు, మున్సిపాలిటీ డిఈ హరిభువన్ పాల్గొన్నారు.