బాసర త్రిబుల్ ఐటీ సరికొత్త రికార్డు
28-02-2026 06:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించింది. విద్యార్థుల చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్న నైట్ స్టడీ అవర్స్ ప్రోగ్రాం మూడు రికార్డులను సాధించినట్టు వైస్ ఛాన్స్లర్ తెలిపారు. పియుసి 1, పియుసి2 తరగతులకు చెందిన 3,2 38 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో కూడిన స్టడీ చేయడం రికార్డుకు సాధ్యమైంది.
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైస్ బుక్ రికార్డ్, నేషనల్ బుక్ రికార్డు లో ఈ ఘనత సాధించడంతో ధ్రువీకరణ పత్రాలు అందించినట్టు తెలిపారు. ప్రతిరోజు 8 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడ మీ బ్లాకులో ఈ స్టడీ అవర్స్ ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ గణిత సాధించిన విద్యార్థులను ప్రొఫెసర్లు అభినందించారు




