మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామ పంచాయతీ మురుట్ల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ ద్వారా ఫౌండర్ రేష్మా ఆధ్వర్యంలో ఒక ఎల్ ఈడి టీవీ, టేబుల్, కుర్చీలు, విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు బుధవారం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్ హాజరవ్వగా ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ లు వాసం సువర్ణ, సురేష్, ఉపసర్పంచ్ లు రాఘవేంద్ర రావు, కోటి, కాంగ్రెస్ నాయకులు కేశెట్టి ఖాదర్ బాబు, మూడ్ సంజయ్, తిరుపతి, రవి, సర్దార్, మధురెడ్డి, శివ, సంపత్, కుమార్, భూక్యా నరేందర్ బాన్వి ప్రహర్ష పౌండేషన్ నుంచి సంతోష్, షరీఫ్ హాజరయ్యారు.




