1 April, 2026 | 8:33 PM

Breaking News

వాటర్ ట్యాంక్‌తో నీటి సరఫరా సర్పంచ్ ఆదర్శం   •   సలేశ్వరం జాతరలో హోం గార్డ్ ఆత్మహత్య   •   వీర వనిత అనసూయమ్మ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయం   •   ఉచిత కుట్టు, బ్యూటీ పార్లర్ శిక్షణ కేంద్రం ప్రారంభం   •   సీసీ రోడ్డు పనులకు భూమి పూజ   •   జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు   •   కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తులం బంగారం ఎప్పుడు? – ఎమ్మెల్యే తలసాని ప్రశ్న   •   పంచాయతీ కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై బీజేపీ ఆగ్రహం   •   సీతారాంపల్లి గ్రామపంచాయతీ స్లాబ్ నిర్మాణ పనులు   •   "కులవివక్ష చూపిన వారిని అరెస్ట్​ చేయాల్సిందే": ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య   •  

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి

01-04-2026 06:36 PM

- బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్

కరీంనగర్,(విజయక్రాంతి): తమకు మేయర్ పదవి ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానని నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎందుకు పెట్టలేదని బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ  ప్రత్యేక అధికారుల పాలనలో రూపొందించిన బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేసి పెట్టారన్నారు. బడ్జెట్ లో నిధులను ఎలా సమీకరిస్తారో పేర్కొనలేదన్నారు.

పండుగలకు పెట్టే ఖర్చులను తగ్గించిన బీజేపీ పాలక వర్గం అవసరం లేకున్న నియమించిన ఉద్యోగులు, వారు వాడుతున్న వాహనాల వృథా ఖర్చులు తగ్గించాలన్నారు. 18 వేల ఇండ్లపై పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని, ప్రజలపై పన్నుల భారం వేయొద్దన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను చూస్తే జాలేస్తుందని.. వారే అధికారంలో ఉండి... కుక్కలు, కోతుల బెడద గురించి నిరసన తెలపడం శోచనీయమన్నారు. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత అక్రమ కట్టడం అంటూ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీ కమీషన్ల కోసం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. డంప్ యార్డ్, నగర అభివ్రుద్ది చేయడం నాతో కాదని బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.