బండారు లక్ష్మారెడ్డి సేవా దృక్పథం ఆదర్శనీయం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మెడికల్ విద్యార్థులకు ఫీజు చెక్కుల పంపిణీ
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి) : ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సేవా దృక్ప థం అందరికీ ఆదర్శనీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు వారి విద్యా సంవత్సరం ఫీజుల నిమి త్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమం కేటీఆర్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు చెక్కులను అందజేస్తూ, వారి భవిష్యత్తుకు శుభా కాం క్షలు తెలిపారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలోని పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్న ఎమ్మె ల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
బండారి లక్ష్మారెడ్డి మాట్లాడు తూ.. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యా ర్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ‘బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహి స్తున్న ట్లు తెలిపారు. ముఖ్యం గా వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజుల భారం కలగ కుం డా చూస్తామని, వారు భవిష్యత్తులో గొప్ప వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వైద్య విద్యార్థు లు, వారి కుటుంబ సభ్యులు, తమ చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి, తమకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




