5 March, 2026 | 3:45 AM

క్రేజీ కల్యాణం.. బాల్‌రాజ్ సందడి!

05-03-2026 01:48 AM

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ పోషించిన బాల్‌రాజ్ క్యారెక్టర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తరుణ్ భాస్కర్ సూపర్ మ్యాన్‌లా జోష్‌లో కనిపిస్తున్నారు.

పెళ్లి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రమిది. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి గోరటి వెంకన్న, చైతన్యప్రసాద్, కాసర్ల శ్యామ్ పాటలు రాశారు. డీవోపీగా శ్యామ్ దూపాటి, ఆర్ట్ డైరెక్టర్‌గా సాయి కదిర, ఎడిటర్‌గా శ్రావణ్ కటికనేని పనిచేస్తున్నారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ బాధ్యతలను భద్రప్ప గాజుల నిర్వర్తించగా, శ్రీనివాస రవీంద్ర స్క్రీన్‌ప్లేలో పాలుపంచుకున్నారు.