సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా బీ.అజయ్ సారధి రెడ్డి ఎన్నిక
మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీలో సిపిఐ పక్షాన ఎన్నికైన 33 వ వార్డు నుండి బి.అజయ్ సారధి రెడ్డి, 18 వార్డు నుండి రేషపల్లి నవీన్, 25వ వార్డు నుండి నర్రా సంధ్యా శ్రావణ్ జిల్లా కేంద్రంలోని వీరభవన్ లో జరిగిన సిపిఐ మున్సిపల్ పక్షం సమావేశంలో 33 వ వార్డు నుండి గెలిచిన బీ.అజయ్ సారధి రెడ్డిని మూడవసారి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనునిత్యం ప్రజల పక్షం వహిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుండి పోరాడుతుందని, మహబూబాబాద్ జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి రెడ్డి అన్నారు. ఆదివారం సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం, మండల కార్యదర్శుల సమావేశం సిపిఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ రాబోయే కాలంలో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనునిత్యం వారికి అండగా ఉంటూ సిపిఐ తమ పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. ఒకవైపు ప్రజా సమస్యల పరిష్కారం మరోవైపు పార్టీ విస్తరణ, బలోపేతం ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డుల్లో విజయం సాధించిన బి.అజయ్ సారధి రెడ్డి, రేశపల్లి నవీన్, నర్రా సంధ్యా శ్రావణ్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వరిపల్లి వెంకన్న, నెల్లూరి నాగేశ్వరరావు, తండా సందీప్, బైస స్వామి, జంపాల వెంకన్న, సారిక శ్రీనివాస్, బందు మహేందర్, మారగాని బాలకృష్ణ, జంపాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




