అప్పోజిగూడలో ఓటరు జాబితా సవరణ సర్‌పై అవగాహన
06-07-2026 12:43 AM
మొయినాబాద్, జులై 5(విజయక్రాంతి):మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు అప్పోజిగూడలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్ కల్లెంల జగపతి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు గ్రామస్థులకు ఉచితంగా దరఖాస్తు ఫారాలను నింపి అందిస్తూ స్వచ్ఛంద సేవలు అందించారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు సులభంగా చేరవేయడంలో యువత చొరవ చూపడం అభినందనీయమని కౌన్సిలర్ జగపతి కొనియాడారు.అర్హులైన ఓటర్లందరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా సహాయపడటమే దీని ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు తలుగుల వినీత్, స్థానిక నాయకులు శ్రవణ్, ఆల్వాల్ రెడ్డి, లక్ష్మణ్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.






