3 March, 2026 | 9:45 PM

గేట్ పరీక్షపై అవగాహనా సదస్సు

03-03-2026 12:00 AM

కోదాడ, మార్చి 2 : కిట్స్  మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో గేట్ ఎగ్జామ్స్ పై అవగాహనా సదస్సు నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ సోమవారం తెలిపారు. ముఖ్య అతిధిగా  ఢిల్లీకి చెందిన ఐ ఐ టీ ప్రొఫెసర్ గుహన్ చౌదరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ భారత దేశంలో నిర్వహించే జాతీయస్థాయ ప్రవేశ పరీక్ష   అని తెలిపారు.

ఈ పరీక్ష ద్వారా ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాలు పొందవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ , కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జునరావు, ప్లేస్ మెంట్ ఆఫీసర్ పుష్ప లత,వివిధ విభాగాదిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.