18 March, 2026 | 4:48 PM

ఏయూ లో ‘బయోస్టాటిస్టిక్స్, ఫార్మాకోవిజిలెన్స్‌’పై అవగాహన సదస్సు

18-03-2026 03:11 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో ‘బయోస్టాటిస్టిక్స్ యూజింగ్ జామోవి, ఫ్రమ్ డేటా టు డిసిషన్’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన డాక్టర్ అమీన్ సాహిబ్ షేక్, బయోస్టాటిస్టికల్ పద్ధతులను ఉపయోగించి ముడి డేటాను అర్థవంతమైన నిర్ణయాలుగా ఎలా మార్చవచ్చో జామోవి సాఫ్ట్‌వేర్ ద్వారా వివరించారు. సదస్సులో డాక్టర్ అమీన్ సాహిబ్ షేక్ అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా అధ్యాపక బృందం ఆయనను ఘనంగా సత్కరించారు.

డీన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ  డాక్టర్ వసుధ భక్షి  మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఫార్మా, గణిత శాస్త్రాల సమ్మేళనం ఎంతో కీలకమని, ఇలాంటి సదస్సులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పరిశోధన రంగంలో ఈ అంశాల ప్రాముఖ్యతను ఆమె ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్ బి. తిరుపతి, డాక్టర్ రాజీవ్, డాక్టర్ దివ్యలతో పాటు సుమారు 130 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా మరియు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.