30 July, 2026 | 5:35 PM

Breaking News

మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •  

సైబర్ నేరాలపై అవగాహన

04-06-2026 02:21 AM

మణుగూరు, జూన్ 3,( విజయక్రాంతి) : పట్టణంలోని  సురక్ష బస్టాండ్ ఏరియాలో ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్త్స్ర రాఫ్ బుధవారం అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవ ద్దని హెచ్చరించారు.

ఆన్లైన్లో ఉద్యోగాలు, రుణాలు, బహుమతులు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ డెస్క్ కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచిం చారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని పేర్కొన్న ఎస్త్స్ర రాఫ్, డిజిటల్ లావాదేవీల సమయంలో భద్రతా ప్రమాణాలను తప్ప నిసరిగా పాటించాలని కోరారు. ఈ అవ గాహన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, స్థానిక వ్యాపారులు, ప్రజలు పాల్గొని సైబర్ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.