11 March, 2026 | 11:44 AM

సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన

11-03-2026 12:20 AM

ఆమనగల్, మార్చి 10(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ’ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక - 99 రోజుల యాక్షన్ ప్లాన్’ వేగంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా మంగళవారం ఆమనగల్ మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలన లో భాగంగా మంగళపల్లి గ్రామ రైతు మనోహర్ సాగు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని అధికారులు సందర్శించారు. మొక్కజొన్న పంట (సేంద్రియ పద్ధతిలో),నాటు కోళ్ల పెంపకం,పాడి పరిశ్రమ విభాగాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమనగల్ సహాయ వ్యవసాయ సంచాలకులు  శోభారాణి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చని తెలిపారు. మట్టి పరిక్షల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఏఈవోలు బాలకృష్ణ, భూదేవి, మీనాక్షి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.