22 July, 2026 | 10:38 PM

వైభవంగా రథయాత్ర

22-07-2026 09:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): గాంధీచౌక్ లోని మురళీకృష్ణ ఆలయం ఇస్కాన్ నిర్మల్ వారి భక్తి నివేదన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కో -ఆప్షన్ సభ్యులు అపర్ణ ప్రదీప్, కౌన్సిలర్ లక్కాకుల హరీష్, నాయకులు అడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.