8 August, 2026 | 10:01 PM

కడుపునొప్పి భరించలేక ఉరి వేసుకుని మహిళా మృతి

08-08-2026 08:34 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన అంబిల్ పూర్ రజిని (34) అనే మహిళ కడుపునొప్పి భరించలేక ఫ్యానుకు ఉరీ వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... గత మూడు సంవత్సరాల నుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చూపించిన ఫలితం లేకుండా పోవడంతో  జీవితం మీద విరక్తి చెంది శుక్రవారం రోజున మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో లోపల నుండి గడియ పెట్టుకొని,  తనకు తానుగా చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సిఐ తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారూ.