23 August, 2026 | 3:06 AM

సైమా నామినేషన్ పార్టీలో అశ్వినిరెడ్డి

23-08-2026 01:01 AM

కాక్టెయిల్ కౌచర్‌లో మెరిసిన పాయల్ రాజ్‌పుత్

హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేట్ సైమా నా మినేషన్ పార్టీలో నటి పాయల్ రాజ్‌పుత్ తన గ్లామరస్ లుక్‌తో ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ అశ్వినిరెడ్డి తాజా ‘కాక్టెయిల్ కౌచర్’ కలెక్షన్ నుంచి ప్ర త్యేకంగా రూపొందించిన డిజైనర్ వేర్‌లో పాయల్ మెరిశారు. ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో గుర్తింపు పొందిన పాయల్ రాజ్‌పుత్ తనదైన కాన్ఫిడెన్స్, గ్లామర్‌తో ఈ ప్రత్యేక లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు.

ఆధునిక సిల్హౌట్, ప్రత్యేకమైన డీటెయిలిగ్‌తో రూపొందించిన ఈ డిజైన్ అశ్విని రెడ్డి కౌచర్ శైలిని ప్రతిబింబించింది.  గ్లామర్‌కు కొత్త రూ పాన్ని అందించేలా ఈ లుక్‌ను రూపొందించారు. అశ్విని రెడ్డి తాజా కాక్టెయిల్ కౌచర్ కలెక్షన్ ఆధునిక లగ్జరీ, సొగసైన సిల్హౌట్స్, స్టేట్మెంట్ డీటెయిలింగ్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పాయల్ రాజ్‌పుత్ తన కాన్ఫిడెంట్ స్టైల్తో మరింత గ్లామర్‌ను జోడించారు.