2 March, 2026 | 8:49 PM

ఆర్యవైశ్యులు ఆత్మ విమర్శ చేసుకోవాలి

02-03-2026 12:36 AM
  1. రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వని వారిని తిరస్కరించాలి
  2. ఆర్యవైశ్యుల ప్రముఖులు

మిర్యాలగూడ, మార్చి1(విజయక్రాంతి) : ఆర్యవైశ్యులు ఆత్మ విమర్శ చేసుకోవాలని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వని వారిని తిరస్కరించాలని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వాసవీ భవన్‌లో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇటీ వల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్యవైశ్య అభ్యర్థులకు సన్మాన సభలో అఖిలభారత ఆర్యవైశ్య మహిళా నాయకురాలు రాయపూడి భవాని, ఆర్యవైశ్య సం ఘం జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు, పందిరి రవీందర్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతాలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్య వైశ్యులకు అన్ని రాజకీయ పార్టీల నుంచి సరైన ప్రాధాన్యత లభిం చడం లేదన్నారు.

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవి ఆర్యవైశ్య ప్రముఖులకే కేటాయిస్తామని పలువురు రాజకీయ ప్రముఖు లు అధికార ప్రతినిధులు ప్రకటించినప్పటికీ జనరల్ మహిళకు రిజర్వేషన్ కేటాయించిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని ఉద్దేశపూర్వకంగా బీసీ మహిళలకు కేటాయించడం అన్యాయమన్నారు. పదవులు శాశ్వతం కాదని కనీస గౌరవం కూడా ఇవ్వని వారిని గుర్తుంచుకోవాలని, ఆర్యవైశ్యులు ఏ పార్టీ ద్వారా పనిచేస్తున్నప్పటికీ ఎన్నికల స మయంలో ఆయా ప్రాంతాల్లో ఆర్యవైశ్యులు ఎన్నికల బరిలో ఉంటే వారికి ఓటు వేసి తమ నైతిక విలువలను చూపాలని పిలుపునిచ్చారు.

మన ఓటు మన వాళ్లకే వేయాలనే సంకల్పం రావాలని, ఓటు వేసే ముందు వా సవీ మాతాను స్మరించుకోవాలన్నారు. ఆర్యవైశ్యులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా స్పందించే వరకే మద్దతు తెలపాలని అన్నారు.  ఇప్పటికైనా ఆర్యవైశ్యులు సామాజిక రాజకీయ అంశాలలో తమ ధోరణి మా ర్చుకొని తాము దేనికైనా సిద్ధం అనే విధంగా తయారు కావాలని కోరారు.

ఈ సందర్భం గా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధించిన ఆర్యవైశ్య అభ్యర్థులు పందిరి గీత గుడిపాటి క్రాంతి నవీన్, మిట్టపల్లి శ్రీదేవి కృష్ణయ్యలను ఆర్యవైశ్య సంఘం, అసోసియేషన్, వివిధ వాసవి క్లబ్ ప్రతినిధులతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కర్ణాటి రమేష్, పట్టణ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, బందర్ కుశ లయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మి, గుడగుంట్ల శర ణ్య గణేష్, లకుమారపు సుష్మ శ్రీధర్, చిల్లంచర్ల శ్రీనివాస్ జయిని రాములు, లకుమా రపు పాండురంగయ్య, వరుణ్, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, వివిధ వాసవీ క్లబ్ చైర్మన్లు కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు.