రెండేళ్లలో 3,903 కొత్త పరిశ్రమలకు అనుమతులు
- హైదరాబాద్‌ను మరో ఢిల్లీలా కాకుండా అభివృద్ధి చేస్తాం
మండలిలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): గత రెండు సంవత్సరాల్లో టీజీ ఐపాస్ ద్వారా 3,903 నూతన పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నూతన పరిశ్రమల ద్వారా లక్షా 5 వేల 960 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయని, నైపుణ్యం ఉన్న దగ్గర పరిశ్రమలు తీసుకురావాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గత రెండేళ్లలో ఈ జిల్లాలో 133 యూనిట్లకు టీజీ-పాస్ అనుమతులు ఇచ్చామని, దీంతో రూ.112 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 1,518 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. వీటి ద్వారా వివిధ దశల్లో 1,82,121 మందికి ఉపాధి లభించనుందన్నారు. శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు మధుసూదనా చారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఫ్యూచ ర్ సిటీ నిర్మించడం ద్వారా హైదరాబాద్‌ను మరో ఢిల్లీ, ముంబాయి నగరాల్లా కాకుండా కాలుష్యం, ట్రాఫిక్ సమస్య బారిన పడకుం డా అభివృద్ధి చేస్తామన్నారు.
దీనికి ముందు జిల్లాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుతో ఏమా త్రం ఉపయోగం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొనగా, దీనిపై మంత్రి స్పందిస్తూ ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్కు విజయవంతంగా నడుస్తోందని, నిజమామాబాద్, ఆదిలాబాద్ లో అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. చిన్నతరహా పరిశ్రమలను, మహిళలను ప్రోత్సా హకాలు అందిస్తున్నామని చెప్పారు.
2023 ఐటీ ఎగుమతుల ద్వారా 9.46 లక్షల మందికి, 2024 9.39 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. 33 జిల్లాల్లో స్కిల్ యూ నివర్శిటీ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అప్పుడే యువతకు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. హిల్ట్ పాలసీ గైడ్‌లైన్స్ అంశాలను కార్మిక సంఘాలతో, యాజమాన్యాలతో చర్చించి కార్మికు లకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కార్యాచరణ రూపొందించామన్నారు.




