ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్,ఆయా పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం
06-06-2026 08:01 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బూర్గంపాడు మండల విద్యాధికారి యదు సింహరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు కనీస అర్హత ఇంటర్, ఆయా పోస్టులకు కనీస అర్హత ఏడో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు. మండలంలోని అంజనాపురం, మోరంపల్లి బంజర, ముసలమడుగు, గాంధీనగర్,బూర్గంపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అర్హత జిరాక్సు పత్రాలతో ఈ నెల 8వ తేదీలోగా అందించాలన్నారు. ఇన్ స్ట్రక్టర్, ఆయాలు స్థానికులై ఉండాలని తెలిపారు.






