1 July, 2026 | 9:06 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రేపు అప్పారావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెన్

15-04-2026 04:26 PM

దమ్మపేట, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): జనవరి 21వ తేదీ నుండి వార్షిక మెయింటెనెన్స్ కొరకు పామ్ ఆయిల్ గెలలు అప్పారావుపేట ఫ్యాక్టరీలో స్వీకరించబడ లేదు. రెండు టన్నులకు పైన గెలలను ఇప్పటి వరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలించారు. అప్పారావుపేట ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ పూర్తయి ఎప్రిల్ 16వ తేదీ గురువారం నుండి యధావిధిగా పామ్ ఆయిల్ గెలలు అప్పారావుపేట ఫ్యాక్టరీలో దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, రైతులు పామ్ ఆయిల్ గెలలు ఫ్యాక్టరీకి తరలించి ఫ్యాక్టరీ, రైతుల అభివృద్ధికి సహకరించాలని అప్పారావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మేనేజర్, అశ్వారావుపేట ఫ్యాక్టరీ డిప్యూటీ మేనేజర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల డివిజనల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.