10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పని దినాలు, సెలవు దినాల తుది షెడ్యూల్ గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బీఏసీ సమావేశంలో సీఎం చంద్రబాబు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు(AP Assembly Session 2025) గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ (టిడిపి) సభలో చర్చ కోసం 18 అంశాలను ప్రతిపాదించింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో శాసనసభ, శాసన మండలి రెండింటిలోనూ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.






