3 June, 2026 | 10:28 PM

ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేసిన ఏవో హరికృష్ణ

03-06-2026 09:34 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో అగ్రికల్చర్ ఏవో హరికృష్ణ బుధవారం విత్తనం, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. మండలంలో సరిపడ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ధరకే విత్తనాలు అమ్మాలని, అధిక ధరలకు అమ్మినట్లు తెలిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని డీలర్లకు హెచ్చరించారు. రైతులు తొలకరి వర్షాలకు విత్తనాలు విత్తుకోవద్దని భూమి తడిచే వరకు ఆగి విత్తుకోవాలని సూచించారు.