12 May, 2026 | 12:10 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతల స్వీకరణ

27-02-2026 12:00 AM

ఆలేరు, ఫిబ్రవరి 26 : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎం హనుమంతు రావుని ప్రభుత్వం దేవదాయ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేయడంతో జిల్లా నూతన కలెక్టర్ గా 2015 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అనురాగ్ జయంతి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనురాగ్ జయంతి గతంలో భోధన్, ఖమ్మం జిల్లాలో సబ్ కలెక్టర్ గా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఖైరతాబాద్ జోనల్ కమీషనర్‌గా పని చేశారు,

ప్రస్తుతం జిహెచ్‌ఎం సి ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ లో జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతి బదిలీ పై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అట్టడుగు ప్రజలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.