20 May, 2026 | 6:54 PM

బెల్లంపల్లిలో యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఆకస్మిక తనిఖీలు

20-05-2026 05:44 PM

- గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

- బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిర్యాల నార్కోటిక్ టీమ్, నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌ బుధవారం బెల్లంపల్లి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికతనిఖీలు కలకలం రేపాయి. బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ పార్కింగ్ ప్రాంతం, ఆటో స్టాండ్, హోటళ్లు,పాన్ షాపులు, ఇతర అనుమానాస్పద ప్రదేశాల్లోఈ తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ ప్రాంగణం, ప్రయాణికుల సామగ్రి, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు, అలాగే చిన్నపిల్లలకు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు, గుట్కా,సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయనీ ఆయన వెల్లడించారు.