రుద్రంగిలో మెడికల్ షాపుల బంద్ విజయవంతం
20-05-2026 05:46 PM
రుద్రంగి,(విజయక్రాంతి): బుధవారం రోజున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ ల బంద్ కొనసాగుతుంది,ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలను నిషేధించాలని. అలాగే కార్పొరేట్ మెడికల్ షాపుల్లో అధిక డిస్కౌంట్లను ఆపాలని సుపీరియర్ మెడిసిన్ విక్రయాలను నివారించాలని, ఈ మూడు ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ చేపడితున్నట్టు తెలిపారు.ఈ బందుకు ప్రజలు సహకరించాలని మండల అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేశారు.






