11 April, 2026 | 3:28 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

02-12-2025 01:07 AM

సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్

సుల్తానాబాద్, డిసెంబర్ 01 (విజయ క్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను తెచ్చిందని వీటిని వెంటనే రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు, సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల గోడ పోస్టర్లను కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈనెల 7, 8, 9 మూడు రోజులపాటు మెదక్ పట్టణంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు జరుగుతున్నాయని డిసెంబర్ 7న కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని అన్నారు.... ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిలభారత అధ్యక్షురాలు హేమలత జాతీయ నాయకులు బి,వి, రాఘవులు , ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు, ఈ కార్యక్రమంలో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు....