3 June, 2026 | 4:30 AM

స్టాన్లీ కాలేజీకి మరో పురస్కారం

03-06-2026 01:09 AM

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌కు ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్ అవార్డు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ప్రతిష్ఠాత్మకమైన ఎన్విరా న్మెంటల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నది. భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సస్టైన బుల్ క్యాంపస్ ఇంపాక్ట్ సమ్మిట్, అవా ర్డ్స్ కార్యక్రమంలో ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్‌గా గుర్తింపు పొందింది.

ఈ కార్యక్రమాన్ని రిసెర్చ్ హైట్స్ ఫౌండేషన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించింది. ఈ మహాసదస్సు జూన్ 1న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో జరిగింది. భారత్ ఎన్విరా న్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన ఎర్త్ వీక్ (ఏప్రిల్ 22 సందర్భంగా స్టా న్లీ కళాశాల విజయవంతంగా ఆరు సుస్థిరతా కార్యక్రమాలను నిర్వహించింది.

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, సామాజిక బా ధ్యత పట్ల కళాశాల నిబద్ధతను ప్రతిబింబించే ఈ కార్యక్రమాలు సంస్థకు విశిష్ట గుర్తింపును తీసుకువచ్చాయి. ఈ కార్యక్రమానికి డా. జి. సతీష్‌రెడ్డి, మాజీ చైర్మన్, డీఆర్డీవో, ప్రొఫెసర్ టి.జి. సీతారాం, మాజీ చైర్మన్, ఏఐసీటీఈ తో పాటు పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, జాతీయ నాయకులు హాజరయ్యారు. అవార్డును కళాశాల తరఫున డా.గుంత కార్తీక్, డైరెక్టర్ (ఆర్ అండ్ డీ), డా.కనకదుర్గ, హెచ్‌ఓడీ  ఐటీ విభాగం, ఎం. సందీప్త, ఖమర్ ఫా తిమా, రుమాన్ జుబైర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీఎస్‌ఈ విభాగం స్వీకరించారు. కళా శాల కరస్పాండెంట్ కృష్ణారావు, డైరెక్టర్లు ఆర్. ప్రదీప్ రెడ్డి, టి. రాకేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. బి.ఎల్. రాజు అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు.