23 June, 2026 | 10:10 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

అన్నదానం మహాదానం

05-11-2025 05:41 PM

మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్..

అమీన్ పూర్: కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్టపైన బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ అనంతరం ఆయన మాట్లాడుతూ... కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునే లక్ష పైచిలుకు భక్తులకు మా సభ్యులతో కలిసి ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు నరసింహా గౌడ్ తెలిపారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన తెలిపారు.