18 May, 2026 | 1:26 AM

అంకిరెడ్డి వర్ధంతి

18-05-2026 12:16 AM

మఠంపల్లి, మే 17 :  మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి తండ్రి గుండ్లపల్లి మాజీ సర్పంచ్ శానంపూడి అంకిరెడ్డి  వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామ అభివృద్ధికి అంకిరెడ్డి  చేసిన సేవలు మరువలేనివని, వారి అడుగుజాడల్లోనే నా వంతుగా అధికారంలో ఉన్నా, లేకున్న గ్రామాభివృద్ధికి చేతనైనంతగా సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను నేరుగా సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపాలెం మాజీ జడ్పీటీసీ చంద్రకళ సైదిరెడ్డి , మఠంపల్లి మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాసరెడ్డి, మఠంపల్లి బీజేపీ పార్టీ అధ్యక్షులు వెంకటశివ గ్రామ  పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.