8 August, 2026 | 4:28 PM

మనుషులను దూరం చేసే కోపం

20-07-2026 12:00 AM

కోపం ఓ పెనుగాలి

క్షణకాలమే నిలిచినా

అప్పటికే కొమ్మలు, చెట్లు

విరిగి వాలి పోతాయి.

కోపం అగ్ని లాంటిది

క్షణాల్లో మనుషుల 

మనసుల్ని కాల్చి భస్మం చేస్తుంది

కోపానికి విచక్షణకు వైరం

కోపంలో విచక్షణను కోల్పోతాం 

కోపం  సునామీ

బంధాల వేళ్లను సైతం

పెకిలించి తీసుకుపోతుంది

కోపం ఒంటరిగానే వస్తుంది

పోతూ పోతూ దాని వెంట

వివేకాన్ని, మంచి బంధాలను..

తన వెంట తీసుకెళ్లి 

మట్టిలో కలిపేస్తుంది

కోపంలో వదిలిన మాటల తూటా

ఆనందంలో ఇచ్చిన వాగ్దానం

పశ్చాత్తాపానికి గురి చేస్తుంది !!

 మధుపాళీ