స్ఫూర్తి రగిలించే ఫైట్ మహా
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రధాన పాత్రల్లో డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఫైట్ మహా’. ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్‌రాజు, ఆనంద్‌చంద్ర నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదలైంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఆనంద్‌చంద్ర మాట్లాడుతూ.. “కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, ఎక్కడో దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ. ‘మహా’ మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన జీవితంతో ఫైట్ చేస్తుంటాడు” అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: నాని ఐయివెల్లి; సంగీ తం: వసంత్ ఇసైపెట్టై; లిరిక్స్: శ్రీరామ్ తపస్వి; ఎడిటర్: ఆనంద్ పవన్; ప్రొడక్షన్ డిజైన్: దేవర మధుకర్.






