18 July, 2026 | 12:24 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ప్రతి ఉదయం ఒక ప్రేరణ

10-11-2025 12:00 AM

చీకటిని చీల్చుకుంటూ

చిరునవ్వుతో పైకి లేచే సూర్యుడు

నిద్ర మత్తును తొలగించి

జగతిని జాగృతం చేస్తాడు

మేఘాల ముసుగులు తొలగి,

ఆకాశం తామరపూవై తేలిపోతుంది

కాంతి చారలు వెదజల్లుతూ

దిక్కులన్నీ మెరిసిపోయాయి

గాలులు మృదువుగా ఊదుతాయి

పక్షులు గీతాల్ని ఆలపిస్తాయి

పూలు తలలు ఊపుతాయి

ప్రకృతిని పులకరింపజేస్తాయి

నదులపై కిరణాలు నాట్యం చేస్తాయి

పొలాలపై బంగారు తెర పరుచుకుంటుంది

తల్లి భూమి చిరునవ్వుతో

పిల్లలను మేల్కొలుపుతుంది

సముద్ర ఉపరితలంపై

మొదటి కిరణం పడగానే 

వేల సంవత్సరాల చరిత్రలాగే

నిత్యజీవితం మళ్లీ మొదలవుతుంది.

సూర్యోదయం ఆశకు ప్రతీక

ఆరంభానికి సంకేతం

అంతరంగాలకు నూతన గీతం

ప్రతి ఉదయం చెబుతుంది 

‘లేచి రా! జీవితం ఎదురుచూస్తుంది’

ఆ కిరణాల పిలుపులో

ప్రేరణ, ప్రాణం, పరవశం కలిసిపోతాయి !

- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్