24 March, 2026 | 2:53 PM

ప్రతి ఒక్క ఉద్యోగి శ్రమ, పట్టుదల, తపనకు దక్కిన అవార్డు

24-03-2026 12:00 AM
  1. ఎన్పీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మకమైన గవర్నెన్స్ నౌ 12వ పీఎస్‌యు ఎక్సలెన్స్ అవార్డ్

సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

వరంగల్, మార్చి 23 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మకమైన గవర్నెన్స్ నౌ 12వ పీ ఎస్ యు అవార్డు 2026 ఆపరేషనల్ ఎక్సలెన్స్,  ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎన్పీడీసీసీఎల్ కు  వరించిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఇటీవల న్యూ ఢిల్లీ లో నిర్వహించిన కార్యక్రమంలో  కంపెనీ తరపున కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం డైరెక్టర్లు, సీ.ఈ ల సమక్షంలో హన్మకొండలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్లో  సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి అందచేశారు.

ఈ సందర్బంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క  , ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, వారి మార్గదర్శకత్వంలో ఎన్పీడీసీఎల్ కు రావడం చాల గర్వంగా ఉందని , ఎన్పీడీసీఎల్ లో పనిచేసే ప్రతి ఉద్యోగి శ్రమ, పట్టుదల, తపన వినియోగదారులకు సేవ చేసే సంకల్పం వలన  ఈ అవార్డు సంస్థకు దక్కిందని ఉద్ఘాటించారు.

విద్యుత్ వినియోగదారులకు అందించే సేవలలో వినూత్న సాంకేతికత పద్దతులను అందిపుచ్చుకొని చేపడుతున్న వివిధ కార్యాచరణ సేవలకుగాను ఈ అవార్డు వచ్చిందని  వివరించారు. అలాగే ఇప్పాయి పవర్ అవారడ్స్ 2026 ఇన్నోవేషన్ విభాగంలో ఎన్పీడీసీఎల్ కు పురస్కారం లభించిందని తెలిపారు. విద్యుత్ పంపిణీ రంగంలో అమలు చేసిన వినూత్న కార్యక్రమాలకు గాను ఐపీపీఏఐ పవర్ అవారడ్స్ 2026లో ఇన్నోవేషన్ విభాగంలో అవార్డు అందుకుందని ,  ఈ అవార్డు సంస్థ చేపట్టిన ఆధునిక సాంకేతికను అవలంభిస్తూ చేపట్టిన సమస్యల  పరిష్కారాలను గుర్తిస్తూ ప్రదానం చేయబడిందన్నారు.

ఏఐ ఆధారిత ఫీడర్ అవుటేజ్ అంచనా విధానంతో  ఫీడర్ రిస్క్ ప్రిడిక్షన్,  అవుటేజ్ ఫోర్కాస్టింగ్ మోడల్ను అభివృద్ధి చేశారని, ఈ మోడల్ ఫీడర్కు సంబంధించిన ఫిర్యాదులు, నిర్వహణ రికార్డులు, అంతరాయాల చరిత్ర, వాతావరణ పరిస్థితులను విశ్లేషించి రిస్క్ స్కోర్ను రూపొందిస్తుందని తెలిపారు. తద్వారా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని విద్యుత్ అంతరాయాలను తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల లో దాదాపు 72 లక్షల సర్వీసులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా  అందిస్తున్నామని స్పష్టం చేశారు.

వినియోగదారులతో మమేకమై వారి సమస్యలు తీర్చే కార్యక్రమమే పొలం బాట, ప్రజా బాట అని ఇందులో  వదులుగా ఉన్న లైన్లు, వంగిపోయిన స్తంభాలు లేదా లోపభూయిష్ట డీ టీ ఆర్ (ట్రాన్స్ఫార్మర్) నిర్మాణాల సమస్యలను పరిష్కరిస్తు న్నామని చెప్పారు. ఇందులో 5,000 పైన పొలం బాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు . సర్కిల్, డివిజన్, ఈ ఆర్ వో, సబ్-డివిజన్,  సెక్షన్ ఆఫీసులలో ప్రతి సోమవారం నిర్వహించే విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం  ద్వారా 12,500 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. 

1912 కాల్ సెంటర్ (24x7 వినియోగదారుల హెల్ప్ లైన్) వినియోగదారులు బిల్లింగ్, విద్యుత్ అంతరాయాలు లేదా సేవా  పరమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి 24 గంటలు పనిచేసే కేంద్రీకృత హెల్ప్ లైన్  టికెటింగ్ సిస్టమ్ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు.

సురక్షితమైన విద్యుత్ వినియోగం, విద్యుత్ ప్రమాదాల నివారణ,  వర్షాకాలంలో ప్రత్యేక డ్రైవ్లపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నామని, భద్రతా పట్ల  అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పారు.  ఆన్ లైన్ ద్వారా బిల్లు చెల్లింపుల కోసం యూ పీ ఐ, వాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ మార్గాల ద్వారా చెల్లింపులు సులభం అవుతుందని తెలిపారు. 

డిజిటల్ టెక్నాలజీలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఫీల్ ఇన్నోవేషన్స్ను వినియోగించి విద్యుత్ సరఫరా మెరుగు పరచడం, అంతరాయాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవల ను అందించడం పట్ల సంస్థ నిబద్ధతను చాటుకుంటూ వినియోగదారుల సేవలో తరిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్లు  వి . మోహన్ రావు , వి. తిరుపతి రెడ్డి ,  టి.మధుసూదన్ , సి. ప్రభాకర్ , సి.ఈ లు  రాజు చౌహన్ ,  అశోక్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జియంలు  శ్రీనివాస్ ,  డి .ఈ లు అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.