21 July, 2026 | 5:42 PM

26న కరీంనగర్‌కు అమిత్‌షా!

21-07-2026 12:34 AM

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రానికి బీజేపీ కీలక నేత, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. ఈనెల 26న రాష్ట్రానికి ఆయన వస్తున్నట్లు సమాచారం. కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్రమంత్రు లు రాష్ట్రానికి వరుసగా క్యూ కడుతున్నారు. పలు ప్రభుత్వ అభివృద్ధి, శంకస్థాపన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అమిత్‌షా కూడా వస్తున్నారు. ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వస్తున్నా.. బీజేపీ రాష్ట్ర ముఖ్యనాయకులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.