23 June, 2026 | 11:37 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

అమన్‌రావు విధ్వంసం

23-06-2026 12:01 AM

32 బంతుల్లోనే సెంచరీ

టీజీ20 లీగ్‌లో రికార్డులు

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరే గాడు. కేవలం 32 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్‌లో అతడు 15 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో అమన్ రావు  కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆద్యంతం రెచ్చిపోయిన అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా రాష్ట్రాల టీ20  లీగ్స్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. కాగా అమన్‌రావు ఐపీఎల్-2026 లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటకీ ఆర్చర్ వంటి ఫాస్ట్ బౌలర్లను నెట్స్ లో ఎదుర్కోవడం కలిసొచ్చింది. 2025 విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేశాడు.