1 July, 2026 | 7:52 PM

Breaking News

ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •  

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఆర్థిక సాయం అందించిన పూర్వవిద్యార్థులు

06-05-2026 06:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విశ్రాంత గురువు కు ఆర్థిక సాయం అందించిన 1985 - 86 పదవ తరగతి బ్యాచ్  పూర్వ విద్యార్థులు, పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం. డి .వలియుద్దీన్  అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయము తెలుసుకున్న పూర్వ విద్యార్థులు  పోలాడి రామ్ గోపాల్,  ఎన్ నారాయణ బాబు, జె మల్లయ్య, డీలర్ అంజయ్య గౌడ్, ఆర్ స్వామి దాస్ , గడ్డం అశోక్ రెడ్డి, పన్నాల రాములు, గడ్డం శ్రీనివాస్, దొడ్ల అంజనీ ప్రసాద్, పల్లెర్ల  నరేందర్ , మిట్టపల్లి రామకృష్ణ , పీవీ శ్రీనివాస్, కొమురవెల్లి అశోక్, కొమురవెల్లి భాస్కర్, ఎండి. ముజాహిద్, ఎండి. అలీ మహమ్మద్   వారి పరిస్థితిని తెలుసుకొని వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పి వారికి అందరూ కలిసి 30 వేల రూపాయలు నగదును వారికి అందించడం జరిగింది , మేమందరం ఈ రోజు ఈ స్థాయిలో   ఉన్నామంటే అది మాకు చదువు చెప్పిన గురువులే కారణమని గురువుకి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గురువుగారైన వలి యోద్దీన్ సంతోషించి  మీరందరూఆయురారోగ్యంగా ఉంటూ ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించాలని అన్ని రంగాలలో రాణించాలని అందరిని ఆశీర్వదించారు.