1 September, 2026 | 11:08 PM

Breaking News

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •  

రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన అక్కినేని నాగార్జున

01-09-2026 | 10:16pm

రాజమండ్రి, 1 సెప్టెంబర్ 2026: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే, ప్రముఖ ఆభరణాల కంపెనీలలో ఒకటిగా వెలుగొందుతున్న కళ్యాణ్ జ్యువెలర్స్, ఈ రోజు రాజమండ్రిలోని మల్లినా నగర్‌లో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నటుడు అక్కినేని నాగార్జున  ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ వారి ముహూరత్ (పెళ్లి ఆభరణాల శ్రేణి), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమః (టెంపుల్ జ్యువెలరీ) వంటి ప్రముఖ హౌస్ బ్రాండ్‌లతో పాటు మరెన్నో అద్భుతమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

విలాసవంతమైన వాతావరణంతో పాటు కల్యాణ్‌ జువెల్లర్స్‌ అందించే ప్రత్యేక ఆభరణాల శ్రేణుల్లోని విస్తృత డిజైన్లను ఈ కొత్త షోరూమ్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్‌ అనుభూతిని అందించేలా షోరూమ్‌ను తీర్చిదిద్దారు.

షో రూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్ వారి కొత్త షోరూమ్ ప్రారంభోత్సవంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నమ్మకం , పారదర్శకత మరియు వినియోగదారులకు తొలి ప్రాధాన్యం వంటి విలువలను నిరంతరం ముందుకు తీసుకెళ్తున్న సంస్థకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. రాజమండ్రిలోని వినియోగదారులు, బ్రాండ్ యొక్క అసాధారణమైన సేవా ప్రమాణాలను, విభిన్న శ్రేణిలోని సున్నితమైన ఆభరణాల కలెక్షన్లను అభినందిస్తూ, కళ్యాణ్ జ్యువెలర్స్‌ పట్ల తమ అభిమానం, మద్దతును అందిస్తారని నేను నమ్ముతున్నానని అన్నారు.

ఈ ప్రారంభోత్సవంపై కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో మా కొత్త షోరూమ్ ను వైభవంగా ప్రారంభించటం ద్వారా మా వినియోగదారుల మారుతున్న అవసరాలను నిజంగా తీర్చే ఒక సమగ్ర షాపింగ్ గమ్యస్థానాన్ని సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క శాశ్వతమైన విశ్వాసం, పారదర్శక విలువలకు కట్టుబడి ఉంటూనే ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సేవల ద్వారా ఉన్నతమైన అనుభవాన్ని అందించడానికే మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.

ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ 'వాల్యూ యాడిషన్'పై 30% తగ్గింపుతో ప్రత్యేక ఇన్-స్టోర్ ఆఫర్లను ప్రకటించింది. * మార్కెట్‌లోనే అత్యంత తక్కువగా, అన్ని షోరూమ్‌లలో ఒకే విధంగా ఉండే బ్రాండ్ యొక్క స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేటు కూడా పరిమిత కాలం పాటు వర్తిస్తుంది.