భావి భారత పౌరులుగా అక్కెనపల్లి విద్యార్థులు
నంగునూరు,(విజయకాంతి): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన పెంపొందించేందుకు మండల పరిధిలోని అక్కెనపల్లి మోడల్ స్కూల్ లో బుధవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ మంద జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులు స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుల పాత్రలను పోషించి సభను నడిపించారు.
స్పీకర్‌గా ఎస్. వెన్నెల, ప్రధానిగా వి.మనోజ్, ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. చట్టాల రూపకల్పన, ప్రశ్నోత్తరాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రాయోగిక అవగాహన లభించిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. సీనియర్ అధ్యాపకులు డా. ఎస్. శ్రీనివాస్, ఎ. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.




