26 May, 2026 | 3:54 AM

ఏఐఎన్యూ ఆసుపత్రి ఘనత

26-05-2026 12:00 AM

53 ఏళ్ల వ్యక్తికి గుమ్మడికాయ పరిమాణంలోని కిడ్నీ క్యాన్సర్ గడ్డ తొలగింపు

హైదరాబాద్, మే 24 (ఆదివారం): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఏషి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ ఆసుపత్రి) వై ద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. 53 ఏళ్ల వ్యక్తి కిడ్నీలో సుమారు 20 సెంటీమీటర్ల మేర పెరిగి, గుమ్మడికాయ పరిమా ణానికి చేరిన భారీ క్యాన్సర్ గడ్డను అత్యంత విజయవంతంగా తొలగించి, ఆ రోగికి ప్రాణదానం చేశారు.

ఏఐఎన్యూ ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్, ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి, సెంటర్ ఫర్ యూరో-ఆంకాలజీ కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి నే తృత్వంలోని నిపుణుల బృందం ఈ అత్యం త సవాలుతో కూడిన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. బయటకు తీసిన ఆ గడ్డ సుమారు 20 సెంటీమీటర్ల పొడవుతో, ఒక గుమ్మడికాయంత పరిమాణంలో ఉంది. శస్త్రచికిత్స అనంతరం రోగి  వేగంగా కోలుకున్నాడు.

ఏఐఎన్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘చుట్టుపక్కల ఉన్న కీలక అవయవాలకు ఎలాంటి హాని కలగకుండా ఈ ట్యూమర్ను మా బృందం విజ యవంతంగా తొలగించిందన్నారు. కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడపాల మాట్లాడుతూ ‘గడ్డ పరిమాణం, అది ఉన్న స్థానాన్ని బట్టి ఇది అత్యంత సంక్లిష్టమైన కేసు. మా మల్టీడిసిప్లినరీ బృందం ఎంతో సమన్వయంతో, ఖచ్చి తత్వంతో ఈ సర్జరీని పూర్తి చేసిందన్నారు.