ఘనంగా ఏఐసీటీఈ అంతర్జాతీయ సదస్సు
స్టాన్లీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహణ
హైదరాబాద్, మే 16(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ‘అడ్వాన్స్‌డ్‌టెక్నాలజీ ఫర్ డిజాస్ట ర్ మేనేజ్‌మెంట్’ (ఐసీఏటీడీఎం 2026) పేరుతో నిర్వహిస్తున్న రెండు రోజుల ఏఐసీటీఈ ప్రాయోజిత అంతర్జాతీయ సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ ఎ కృష్ణయ్య హాజ రై సభను ఉద్దేశించి ప్రసంగించారు.
గౌరవ అతిథిగా ఐఈటీఈ చైర్మన్, హైదరాబాద్ సెం టర్ అశ్వనీ కుమార్ సంగంకేర్ పాల్గొన్నారు. ఈ సదస్సు నిర్వహణకు కళాశాల యాజమాన్య సభ్యులు కే. కృష్ణారావు, టీ రాకేష్ రెడ్డి, ఆర్ ప్రదీప్ రెడ్డి విశేష సహకారం అందించారు. కార్యక్రమంలో డీన్ ఐపీఏ డాక్టర్ సత్యప్రసాద్ లంకా, ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ రాజు, జనరల్ చైర్ డాక్టర్ కేఎన్ సాహు, ప్రో గ్రామ్ చైర్ డాక్టర్ నాగశేఖర రెడ్డి, కోఆర్డినేటర్లు డాక్టర్ జీ కార్తిక్, డాక్టర్ సీవీ కీర్తిలత, కన్వీనర్ డాక్టర్ లత యల్లంకి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐసీఏటీడీఎం 2026 సావనీర్‌ను అతి థులు ఆవిష్కరించారు. విపత్తు నిర్వహణలో ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతపై అతిథులు ప్రసంగిస్తూ, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు వినూత్న ఆలోచనలతో సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొని దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
దేశీయ, అంతర్జాతీయ స్థాయిలోని వివిధ విద్యాసంస్థల నుంచి మొత్తం 233 పరిశోధనా పత్రాలు అందినట్లు నిర్వాహకులు తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో తాజా సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు,విద్యార్థులు పరస్పర ఆలో చనలు పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.






