ఎన్ఎస్ఎస్ వాలంటరీలు యూనిఫామ్ లేని భారత సైనికులు
- కేయూ ఈసీ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్
హనుమకొండ,(విజయక్రాంతి): ఎన్ఎస్ఎస్ వాలంటరీ అంటేనే యూనిఫామ్ లేని భారత సైనికులని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్ అన్నారు. హాసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చిర్ర రాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు. మదర్ తెరిసా, స్వామి వివేకానందుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ డా.రాధిక, నాగారం గ్రామ సర్పంచ్ లావణ్య-సంతోష్ దంపతులు, గ్రామ కార్యదర్శి ప్రశాంతి, వార్డ్ మెంబర్ శ్రీవిద్య, కేయూ బయోటెక్నాలజీ విభాగం ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ 50 మంది విద్యార్థులు 7 రోజులు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం కోసం నాగారం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.




