నెల రోజుల పాటు 30,30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జిల్లా ఎస్పి డి.జానకి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలతో కార్యక్రమాలకు చేసేందుకు ముందుకు సాగితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




