3 June, 2026 | 8:51 PM

ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పెంచాలి

03-06-2026 07:38 PM

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలలో విద్యార్థుల ప్రదేశాలు కేంద్రాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో 100 శాతం సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉపాధ్యాయుల అవకాశాలు ఉన్న కోర్సులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అధికారులు ప్రభుత్వ కళాశాలలు బలోపేతం కొరకు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల సంఖ్య 100 శాతం ఉండేలా ఉపాధ్యాయుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, విద్యాధికారులతో సమీక్ష, బడిబాట కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం  పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మాధ్యమిక విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.