14 July, 2026 | 7:13 PM

Breaking News

ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •  

కూలీల మృతికి కారణమైన డ్రైవర్‌పై వేటు

14-07-2026 12:00 AM

సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు 

సిరిసిల్ల , జూలై 13, (విజయ క్రాంతి): వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల మృతికి కారణమైన ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ ఎం నరన్ (బ్యాడ్జ్ నెం. 52247)ను విధుల నుంచి తొలగించారు. సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ్రావు ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న కూలీలను హైర్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు, అతనిపై తక్షణ చర్యగా విధుల నుంచి తొలగించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.