10-02-2026 01:57:47 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : వికారాబాద్‌లో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను, ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించారని, తక్షణమే రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసిం ది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. కురువ విజయ్‌కుమార్ మాట్లాడు తూ... ‘ప్రజాపాలన బాట’ అనే పేరు తో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమం లో, బ్యాంక్ లింకేజ్ కింద చెక్కుల పంపిణీ, 6,650 మహిళా స్వయం సహాయక గ్రూపులకు స్ట్రీ నిధి సహాయం చేయడం ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. అధికారిక ప్రభుత్వ వేదికను, ప్రజానిధులను పక్షపాత రాజకీయ ఉద్దేశాలకు దుర్వినియోగం చేశారని విమర్శించా రు.
ఒక సంక్షేమ కార్యక్రమాన్ని రాజకీయ ఈవెంట్‌గా మార్చి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అభ్యర్థించారని, ప్రస్థుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారని స్ప ష్టం చేశారు. అధికారిక కార్యక్రమంలో పా ల్గొన్న వారిని చేతులు పైకి ఎత్తి ‘జై కాంగ్రెస్’ వంటి రాజకీయ నినాదాలు చేయమని బలవంతం చేశారని విమర్శించారు.
ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన లబ్ధిదారుల ఉనికిని ఉపయోగించి అనుచిత ప్రభావం, రాజ కీయ ఒత్తిడిని సృష్టించారని, ఈ చర్యలు మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను నేరుగా ఉల్లంఘించడమే అని మండిపడ్డారు. ఎన్నికలు జరు గుతున్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత దుర్వినియోగం చేయకుండా స్పష్టమైన, కఠిన దిశా నిర్దేశాలను జారీ చే యాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నా యకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామమూర్తి, కార్తీక్ రాయల పాల్గొన్నారు.