6 August, 2026 | 1:59 AM

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు

07-08-2026 12:00 AM

డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి హెచ్చరిక

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 (విజయక్రాంతి):ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు.బుధవారం ఆయన ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని బొంగుళూరు రెవెన్యూ సర్వే నెం. 11లో గల ప్రభుత్వ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదరు సర్వే నెంబర్లోని ప్రభు త్వ భూములు కబ్జాకు గురవుతున్నాయం టూ స్థానికుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు డిప్యూటీ కమిషనర్ స్పందించారు. ఈ నేపథ్యంలో, బుధవారం తన సిబ్బందితో కలిసి వివాదాస్పద స్థలాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్న స్థలాల్లో ఎవరూ కూడా ఎలాంటి పనులు చేపట్టరాదని ఆదేశించారు. ఈ భూములపై పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.