15 August, 2026 | 4:52 AM

శిల్పారామంలో ‘ఆవాహన్’ కథక్ ప్రదర్శన

15-08-2026 12:00 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక కథక్ నృత్య ప్రదర్శన జరిగింది.భరతనాట్య కళాకారిణి అదితి రావు ఆధ్వర్యంలో కుమారి నిరల్ ఉప్రీత్ ‘ఆవాహన్’ అనే కథాంశంతో ప్రదర్శన ఇచ్చారు. ‘ఆవాహన్’ అనేది మనిషికి దేవునితో జరిగే ఊహాత్మకమైన, అయినా వాస్తవికమైన సంభాషణకు సంబంధించిన భావన. మనుషులుగా మనలోని అనేక ప్రశ్నలను దైవం ముందు పెట్టుకుని మాట్లాడుకునే అవకాశం ఒక్కసారి లభిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని ఈ ప్రదర్శన చెబుతోంది. సంప్రదాయ కథక్ మూలాల ను కాపాడుకుంటూనే సమకాలీన భావాలను మేళవించి ప్రదర్శించడం దీని ప్రత్యేక త. నిరల్ ఉప్రీత్ చక్కని అభినయం, స్పష్టమై న పాద విన్యాసాలు,భావపూరితమైన ము ఖాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.