ఎంహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్‌గా ఆదూరి రవికి బాధ్యతలు
24-02-2026 08:10 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (Madiga Rights Protection Committee) జిల్లా కన్వీనర్‌గా ఇల్లందు పట్టణానికి చెందిన ఆదూరి రవి మాదిగకు వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఇసుకల వెంకన్నను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. జిల్లా స్థాయిలో మాదిగ సమాజ హక్కుల సాధన, పేదల సమస్యల పరిష్కారం, విద్య ఉపాధి అంశాలపై చురుకుగా పనిచేయాలని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలతో ఎంహెచ్పిఎస్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.




