25 February, 2026 | 12:01 AM

అజీం ఖాన్‌కు ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళి

24-02-2026 08:06 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన అజీం ఖాన్ గుండెపోటుతో మృతి చెందగా మృతుని స్వగృహానికి చేరుకున్న కోరం కనకయ్య పార్ధీవ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఎండి ఖుష్బూ మునావర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, 10వ వార్డు కౌన్సిలర్ మెరుగు కార్తీక్, నాయకులు బోళ్ళ సూర్యం, అజాం, దండుగుల శివ తదితరులు పాల్గొన్నారు.