12 March, 2026 | 6:10 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

13 ఏళ్లుగా జీవచ్ఛవంగా యువకుడు

12-03-2026 02:00 AM
  1. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

భావోద్వేగానికి గురైన న్యాయమూర్తి

గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, మార్చి 11: గౌరవంగా మరణించే హక్కు పై బుధవా రం దేశ అ త్యున్నత న్యా యస్థానం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు చెబుతున్న సమయంలో జస్టిస్ జేబీ పార్దీవాలా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆయ న ఒకించలించడంతోపాటు కన్నీటి పర్యంతమయ్యారు.‘ఒక ప్రమాదం అతడి జీవితాన్ని ఊహించని రీతిలో మార్చివేసింది. దానికిముందు అతడొక తెలివైన విద్యార్థి’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కేసు పూర్వాపరాలు..13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రు లకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు చెప్పింది.13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుం చి అతను స్పృహ లేకుండా, పూర్తిగా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాడు.

ఈ కేసును విచారించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కొనసాగించడం రోగి ప్రయోజనాలకు మేలు చేస్తుందా? లేదా? అన్నదే కీలకమని వ్యాఖ్యానించింది.చదువులో చు రుకుగా ఉండే యువకుడు ఇలా జీవచ్ఛవం గా మారడం బాధాకరమని కోర్టు పేర్కొంది. 13 ఏళ్లుగా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, కోలుకునేందుకు ఏమా త్రం అవకాశం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.

ఈ నేపథ్యంలో చికిత్సను కొనసాగించడం వల్ల ప్ర యోజనం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా పైపుల ద్వారా అందించే పోషకాహారం కూడా వైద్య చికిత్స కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యుల బృందం పరిశీలించి, రోగి కోలుకునే అవకాశం లేదని నిర్ధారించిన పక్షంలో లైఫ్ సపోర్ట్తో పాటు పోషకాహారాన్ని కూడా నిలిపివేయవచ్చని ఈ తీర్పుతో స్పష్టమైంది